ప్రస్తుతం సుశాంత్‌సింగ్ మరణం తర్వాత నెపోటిజం అనే అంశం సినిమా ఇండస్ట్రీని బాగా కుదిపేస్తోంది. ఇది బాలీవుడ్‌లో స్టార్ట్ అయ్యి సౌత్‌లో అన్ని సినిమా ఇండస్ట్రీలను కూడా తెగ కుదుపుతోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుశాంత్‌సింగ్ మరణం తర్వాతే దీని గురించి మిగిలిన నటీనటులు స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించాడు. తెలుగులో ఉన్న అగ్రహీరోల నుంచి యువ హీరోల వరకు ప్రతి ఒక్కరిని ప్రస్తావించాడు.
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రిలోకి అడుగుపెట్టినా.. ఆ తర్వాత తమ టాలెంట్‌తోనే తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారని.. ఫ్యామిలీ సపోర్ట్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లు కాదని టాలెంట్ కావాలని నాగబాబు చెప్పాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి చాలా మంది హీరోలు కూడా తమ సొంత టాలెంట్‌తోనే ఈ రోజు స్టార్లు అయ్యారని నాగబాబు చెప్పాడు.
ఇక రవితేజ, విజయ్ దేవరకొండ, కార్తీక్, నాని లాంటి యువ హీరోలు ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని నాగబాబు చెప్పారు. నాగబాబు అందరి పేర్లు ప్రస్తావించినా నాగబాబు బాలయ్యను ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు ముందు నుంచే నాగబాబు బాలయ్యపై ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మాత్రం మరోసారి బాలయ్య పేరు ప్రస్తావిస్తూ ఆయన టాలెంట్‌తో పైకి వచ్చారని ప్రశంసిస్తూ మాట్లాడడం విశేషం.