భారత్ వర్సెస్ చైనా వ్యవహారం అనేది ఇప్పట్లో చల్లారే వ్యవహారం అయితే కాదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చైనా వ్యవహారంలో భారత్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది చాలా వరకు కూడా ప్రపంచం ఎదురు చూస్తోంది. భారత్ విషయంలో చైనా వ్యవహారశైలి పై చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నాయి. చైనా ఇప్పటికే భారత్‌తో సరిహద్దు విషయంలో ఎన్నో కవ్వించే నిర్ణయాలు తీసుకున్నా కూడా భారత్ చాలా వరకు ఓపిక పట్టే ధోరణితోనే ఉంది. ఇప్పటి వరకు… కొన్ని యాప్స్ ని మాత్రమే భారత్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక చైనాతో ఉన్న కొన్ని వ్యాపార ఒప్పందాలను కూడా భారత్ రద్దు చేసుకుంది.
భారత్ ఈ నిర్ణయం తీసుకున్నాకే ప్రపంచ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా చైనాతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు మరో బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి. అది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం… చైనాకు చెందిన కొన్ని సంస్థల వాణిజ్య ఒప్పందాలు భారత్ కంపెనీలతో చేసుకున్నాయి. ఆ కంపెనీ లు భారత్ లో దశాబ్దాలుగా తిష్ట వేసాయి. అవి ఇక్కడే కొన్ని ఆఫీసులు నిర్మించడమే కాదు, తమ దేశం నుంచి తక్కువ జీతాలకు ఉద్యోగులను తెస్తూ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాయి.
మనదేశంలో వ్యాపారం చేస్తూ మన డబ్బులతో కోట్లకు పడగలెత్తుతోన్న ఆ కంపెనీలు మనవాళ్లకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు వాటిని గుర్తించే పనిలో భారత్ ఉంది. వాటిని భారత్ నుంచి సాగనంపాలి అని భారత్ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వాటిని పంపడానికి గానూ అన్నీ సిద్దం చేసి, త్వరలోనే తరిమి కొట్టే విధంగా అడుగులు వేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. చైనాకు ఇస్తోన్న షాకుల పరంపరలో ఇది మరో షాక్ అని కూడా జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.