బ్రేకింగ్‌: మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా…

ఏపీలో క‌రోనా జోరు మామూలుగా లేదు. తాజాగా మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి వైసీపీ ఎమ్మెల్యే స‌త్తి సూర్య‌నారాయ‌ణ రెడ్డికి క‌రోనా వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం తాను హోం ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్టు ఆయ‌నే చెప్పారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సైతం క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్టులో సూర్య‌నారాయ‌ణ రెడ్డి కూడా చేరారు.

 

అయితే ఇప్పటికే ప‌లువురు పార్టీ నేత‌లు, ఇత‌రులు కూడా అనేక ప‌నుల నిమిత్తం ఎమ్మెల్యేల‌ను క‌ల‌వ‌డంతో వారంతా కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఎమ్మెల్యే కోరారు. ఇక ఏపీలో తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌రోనా స్వైర‌విహారం చేస్తోంది. ఇక రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులోనే ఏకంగా 247 మందికి క‌రోనా సోకింది.

Leave a comment