ప్రస్తుతం అంతా వెబ్‌సీరిస్‌ల మయం నడుస్తోంది. వీటికే ఫుల్ డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు, స్టార్ హీరోలు సైతం వెబ్‌సీరిస్‌ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మహేష్‌బాబు కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రాఫిటబుల్ వెంచర్‌గా మారిన వెబ్‌సీరిస్‌ల్లో నటించేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. మహేష్ ఇప్పటికే తన జిఎంబీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సినిమాల నిర్మాణంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఏఎంబీ సినిమాస్‌తో ఎగ్జిబిటర్‌గా కూడా మారాడు. ఇక ఇప్పుడు వెబ్‌సీరిస్‌ల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు వెబ్‌సీరిస్‌లు సైతం జీఎంబీ బ్యానర్లో ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకు మహేష్ నిర్మాణంలో చార్లీ అనే వెబ్ సీరిస్ వస్తుందన్న ప్రచారం అయితే జరిగింది. నమ్రత ఈ వెబ్‌సీరిస్‌ల వ్యవహారాలు చూస్తాడని.. మెహర్ రమేష్ పర్యవేక్షణలో ఇవి రూపొందేలా ప్లాన్ చేస్తున్నారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. తర్వాత ఈ బ్యానర్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో మహేష్ ఆరు నెలల పాటు పూర్తిగా రెస్ట్‌లోనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే మెహర్ రమేష్, మహేష్ కలిసి ఇండస్ట్రీలో కొందరు ఔత్సాహిక డైరెక్టర్లను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించారట. ఇక్కడ మహేష్‌కు ప్రాఫిట్‌తో పాటు ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేసిన పేరు కూడా ఉంటుందన్న ఆలోచన కూడా మహేష్‌కు ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోన క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు చెప్పిన కథలను వినే బాధ్యత కూడా మహేష్ మెహర్ రమేష్‌కే అప్పగించాడంటున్నారు.