Politicsఆ ఒక్క చోటే 9500 మంది పోలీసుల‌కు క‌రోనా... పోలీసు శాఖ...

ఆ ఒక్క చోటే 9500 మంది పోలీసుల‌కు క‌రోనా… పోలీసు శాఖ అంతా అల్ల‌క‌ల్లోల‌మే…!

క‌రోనా వైర‌స్ పోలీసు శాఖ‌ను వ‌ణికిస్తోంది. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే ఏకంగా 9500 మంది పోలీసులు క‌రోనా భారీన ప‌డ్డారు. వీరిలో ఇప్ప‌టికే ప‌లువురు మృతి చెందారు. క‌రోనా వైర‌స్ మ‌న‌దేశంలో ఇప్ప‌టికే 17 ల‌క్ష‌ల ఫిగ‌ర్‌ను క్రాస్ చేసింది. రోజు రోజుకు కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరిగిపోతోంది. ఇక క‌రోనా దెబ్బ‌కు దేశంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు ఎలా అత‌లాకుత‌లం అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా క‌రోనా దెబ్బ‌కు మ‌హారాష్ట్ర అత‌లాకుత‌లం అవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

 

ఈ క్ర‌మంలోనే ఈ రాష్ట్రంలో క‌రోనాను ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తోన్న పోలీసులు ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌వుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9566 పోలీసు సిబ్బంది ఈ వైరస్ భారినపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంతో పాటు పూణె, ధానే న‌గ‌రాల్లో వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే మరో 9600 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

 

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 4.31 ల‌క్ష‌లు దాటింది. 15 వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. నిన్న ఒక్కరోజే 322 మరణాలు సంభవించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే రాష్ట్రంలో మొత్తం 2.60 ల‌క్ష‌ల మంది క‌రోనా నుంచి కోలుకోగా… మ‌రో 1.50 ల‌క్ష‌ల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17లక్షలు దాటింది. వీరిలో 37,364 మంది చనిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news