ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న పుష్ప సినిమాను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వం వహించే ప్రాజెక్టులో బన్నీ జాయిన్ అవుతాడు. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఎనౌన్స్ వచ్చిన వెంటనే బన్నీ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. బన్నీ వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు లైన్లో పెడుతుండడంతో మిగిలిన హీరోలు అందరూ ఒక్కసారిగా షాక్‌లోనే ఉన్నారు.
ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోన్న కొరటాల ఇది కంప్లీట్ అయిన వెంటనే బన్నీ ప్రాజెక్టుపై పని చేస్తాడు. ఇదిలా ఉంటే బన్నీ – కొరటాల సినిమా విషయంలో బన్నీ పెట్టిన ఓ కండీషన్‌కు కొరటాల నిర్దాక్షిణ్యంగా నో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొరటాల ఎంత పెద్ద హీరోతో సినిమా చేసినా తనస్టైల్లోనే.. తాను చెప్పినట్టే ఉంటాడే తప్పా హీరోలు చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకోరన్న టాక్ ఉంది.
ఇక ఇప్పుడు బన్నీ సినిమాను ఎలాగో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నందున ఓ హిందీ సినిమాలా దీనిని తీద్దాం అని బన్నీ సూచించాడట. కొరటాల మాత్రం ఇందుకు కుదరదనే చెప్పేశాడట. ఈ కథ సౌత్‌లో ఓ సున్నిత అంశానికి సంబంధించింది అని.. దీనిని నార్త్ సినిమాగా మారిస్తే రెండిటికి చెడ్డ రేవడి అవుతుందన్నట్టుగా చెప్పాడట.
ఇక చరణ్ జంజీర్ సినిమా ( తెలుగులో తుఫాన్)ను నార్త్ స్టైల్లో తీయడంతో ఇక్కడ జనాలకు అసలు అర్థం కాలేదు. ఇక సాహో హిందీ స్టైల్లో ఉండడంతో మన వాళ్లకు ఎక్కలేదు.. అందుకే కొరటాల బన్నీ చెప్పిన రిస్క్ చేసేందుకు ఇష్టపడడం లేదట.