బెజవాడలోని రమేష్ హాస్పటల్ వివాదం ఇప్పుడు రోజు రోజుకు చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు ఈ వివాదానికి కులం రంగు కూడా పులిమేశారు. దీనిపై అధికార వైఎస్సార్‌సీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. చివరకు చంద్రబాబు సైతం ఇదే అంశంపై రెండు మూడు సార్లు స్పందిస్తూ డాక్టర్ రమేష్‌కు కలం రంగు పూయడాన్ని తప్పుపట్టారు. ఇక రమేష్‌కు సమీప బంధువు అయిన సినీ హీరో రామ్ సైతం రామ్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ట్వీట్‌లు చేశారు.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దీంతో రామ్‌పై సామాన్య ప్రజలతో పాటు వైసీపీ నేతలు కూడా విరుచుకు పడ్డారు. ఇక ఇప్పుడు రామ్ కి మంత్రి కొడాలి నాని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రు. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియాను మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, కొడాలి నాని చెక్కులు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ రమేష్ హాస్పటల్ యజమాని రమేష్ వెనక చాలా మంది బడా నాయకులు ఉన్నారని చెప్పిన నాని.. రమేష్‌ను చంద్రబాబే తన ఇంట్లో దాచుకున్నారని ఆరోపించారు.
రమేష్ ఎక్కడ దాక్కున్నాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్న నాని… హీరో రామ్ చంద్రబాబు మాటలు వినకుండా జాగ్రత్తపడితే మంచిదని హెచ్చరించారు. ఇక ఏ కులం మీద అయినా కక్ష కట్టాల్సిన అవసరం జగన్‌కు లేదని.. తప్పు చేయనప్పుడు రమేష్ ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు.