తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణలో కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా లాక్‌డౌన్ విధించడంతో అక్కడ చాలా రోజులు మందు షాపులు బంద్ చేశారు. గతంలో కేసీఆర్ మందు షాపులు బంద్ చేయడంతో అక్కడ మందుబాబులు విలవిల్లాడిపోయారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే కోట్లాది రూపాయల మద్యం బిజినెస్ ఆగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మద్యం షాపులపై నియంత్రణ కొనసాగుతూ ఉంది.
అయితే ఇప్పుడు మందు బాబులకు కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరపవచ్చు. మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనా ఈ బంపర్ ఆఫర్‌తో మళ్లీ తెలంగాణలో మద్యం విక్రయాలు జోరందుకోవడం ఖాయం.