కొద్ది రోజులుగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. ముఖ్యంగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆమె మరింతగా రెచ్చిపోతూ బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంతో పాటు బాలీవుడ్‌లో ఉన్న డ్రగ్స్ మాఫియా లింకుల గురిచి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆమె టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరోలకు డ్రగ్ మాఫియాతో ఉన్న లింకులపై ఓపెన్‌గానే మాట్లాడేశారు.
కంగన ఈ ట్వీట్ చేశాక కూడా ఆమెకు భద్రత కల్పించకపోవడంపై బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. కంగనాకు ఎందుకు భద్రత కల్పించలేదని… పలువురు బీజేపీ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ప్రశ్నించారు. బీజేపీ నేత రామ్ కదం ఆమె డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేసి 100 గంటలు అయినా ఆమెకు ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మహరాష్ట్రలో ఉన్న బీజేపీ నేతలు కంగనాకు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తికి భద్రత కల్పించిన ప్రభుత్వం కంగనాకు ఇదే తరహాలో ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వైరల్ అవుతుండడంతో కంగనా పొలిటికల్ ఎంట్రీ బీజేపీ నుంచే ఉంటుందని.. అది త్వరలోనే జరుగుతుందన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతానికి కంగనా పొలిటికల్ ఎంట్రీపై ఆచితూచి మాట్లాడుతున్నా రేపో మాపో ఆమె కాషాయ కండువా కప్పుకుని శివసేనను టార్గెట్ చేయడం ఖాయమే అంటున్నారు.