టాలీవుడ్లో అనుష్క, ప్రభాస్ జంట తెరమీద కనిపిస్తే వీనుల విందే. ఈ జోడీ టాలీవుడ్ హాట్ ఫేవరెట్ కపుల్ అని చెప్పాలి. మిర్చి, విక్రమార్కుడు, బాహబలి 1, 2 సినిమాల్లో ఈ జంట జోడీ కట్టడంతో పాటు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరు కలిసి నటిస్తే సినిమాలో ఏ రేంజ్ బ్లాక్ బస్టరో పై సినిమాలే ఉదాహరణ. ఇక బాహుబలి సినిమా తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా వీరు ఖండించారు.
మరోవైపు ప్రభాస్ నాలుగు పదుల వయస్సుకు చేరువ అవుతుంటే అనుష్క కూడా మూడున్నర పదుల వయస్సులో ఉంది. ఇప్పటకీ వీరిద్దరు పెళ్లి చేసుకోకపోవడంతో వీరిపై ఎప్పటికప్పుడు హాట్ హాట్ చర్చలు నడుస్తూనే ఉంటాయి. వీరు ఖండిస్తున్నా ఈ పుకార్లు మాత్రం ఆగవు. ఈ జంటకు కోట్లలోనే అభిమానులు ఉంటారు. ఇక వీరిద్దరిని ఆకాశానికి ఎత్తేసింది ఓ మాజీ హీరోయిన్. ఆమె ఎవరో కాదు కామ్న జెఠ్మలానీ. తాజాగా ఆమె ఫ్యాన్స్‌తో చేసిన చాట్‌లో తనకు నచ్చిన హీరో ప్రభాస్ అని.. హీరోయిన్ అనుష్క అని చెప్పడంతో ఇప్పుడు ప్రభాస్, అనుష్క అభిమానులు కామ్నను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇక రణం తర్వాత బెండు అప్పారావ్, కత్తి కాంతరావ్ అంటూ అప్పట్లో కాస్త హడావుడి చేసింది. తర్వాత ఆమెకు ఎన్ని ఛాన్సులు వచ్చినా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేదు. దీంతో 2014లో ఓ బిజినెస్‌మేన్‌ను పెళ్లాడి బెంగళూరులో సెటిల్ అయ్యింది.