మనసులో ఏదైనా అనుకుంటే అది సాధించేంతవరకూ గట్టి నిద్రపోనటువంటి మరో నటుడు, కార్యసాధకుడు యంగ్ టైగర్ Jr: NTR. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు, వారి తాతయ్య గారు అయినటువంటి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఆశీర్వాదంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు యంగ్ టైగర్. తరువాత అనతికాలంలోనే అబ్బురపరిచే నటన డైలాగ్స్ తో పాటూ మైమరిపించే డాన్స్ లతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కెరియర్ మొదట్లో లవర్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తూ కాస్త తడబడినా, తను వెళ్ళే దారి సరైనది కాదని గ్రహించి రూట్ మార్చారు.
అప్పటివరకూ సీనియర్ నటులు మాత్రమే ఫ్యాక్షనిజం పాత్రలు చేయగలరని సినీ ప్రేక్షకుల భావిస్తున్న సమయంలో కనీసం ఇరవై ఏండ్లు కూడా నిండని తారక్ బరువైన “ఆది” పాత్రను చేసి, తన నటనతో విమర్శకులనుండి కూడా ప్రశంసలు పొందారు. శరీర సాష్టవం కాస్త ఊబకాయం తో ఉన్నప్పటికీ, ఎటువంటి డాన్స్ లనైనా అవలీలగా చేయడంతో పాటూ “యమదొంగ” సినిమాలో యముడి పాత్ర లో చెప్పిన డైలాగ్ ద్వారా తన తన తాతగారులానే ఎటువంటి పాత్రనయినా చేసేయగలనని నిరూపించుకున్నాడు.
ప్రతి చిత్రంలోనూ తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక పేజిని లిఖించుకున్నాడు. కుటుంబ బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, సాధారణ వ్యక్తిగా సినీప్రయాణం మొదలు పెట్టి ఒక శక్తి గా ఎదిగిన తారక్ “బిగ్ బాస్ సీజన్ -1″లో హోస్ట్ గా వ్యవహరించి తన సొంత మేనరిజంతో స్పాంటేనిష్ కామెడీ తో మాటల గారడీ చేసి T.V ప్రేక్షకులకు కూడా మరింత చేరువయ్యారు. అప్పట్లో బిగ్ బాస్ షో ను టెలీకాస్ట్ చేసే ఛానల్ మిగిలిన తెలుగు ఛానల్స్ ను దాటవేసి T.R.P రేటింగ్ మొదటి స్ధానంలో నిలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు. యంగ్ టైగర్ తారక్ T.V రంగంలో కూడా ఎంత సునామీ సృష్టించాడోనని.
ఎన్నికల సమయంలో తన తాతగారు స్ధాపించిన రాజకీయ పార్టీకి కూడా ప్రచారం చేసి, తనదైన ముద్ర వేసారు. అందుకే, ఇప్పుడు మరలా యంగ్ టైగర్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని ఆ పార్టీ వర్గ శ్రేణులు కోరుకుంటున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ప్రతి రంగంలోని ఇంకా ఉన్నతమైన విజయాలు సాధించాలని అలాగే, తన కెరియర్ లో మరచిపోలేని హిట్స్ ఇచ్చినటువంటి ధర్సక ధీరుడు రాజమౌళి ధర్సకత్వంలో మరో అగ్ర నటుడు రాంచరణ్ తో కలిసి నటిస్తున్న RRR మూవీ మంచి విజయం సాధించాలని మనమందరం ఆశిద్దాం ఆల్ ది బెస్ట్ తారక్.