దేశంలో గత వారం రోజుల్లో కరోనా సరికొత్త రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. ఇక గత వారం రోజుల్లో ఇండియాలో ఉన్న కరోనా లెక్కలు చూస్తే మతిపోయేలా ఉంది. ప్రతి రోజు సరాసరీ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇక నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 52, 972 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల సంఖ్య 18,03,695గా నమోదైంది. ఇక మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
గత 24 గంటల్లో మరణాలు 771గా ఉన్నాయి. దేశంలో ఒక్కరోజే ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ తాజా లెక్కలతో కొవిడ్ మరణాల సంఖ్య 38,135కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ భారీన పడి 11 లక్షల మంది కోలుకుంటే.. మరో 6 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత వారం రోజుల్లోనే ఏకంగా 3.70 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే దేశంలో ఇప్పటి వరకు ఉన్న కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు కేవలం 21 రోజులే పడుతుందని చెపుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో కరోనా జోరు రేటు ప్రపంచంలోనే టాప్‌గా ఉంది.