కరోన మహమ్మారి చేసిన మహా ప్రళయానికి ప్రపంచ దేశాలు తీవ్ర ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని చవి చూశాయి. కోట్లాది మంది ప్రజలు ఆర్ధిక భారంతో కుటుంబాలని పోషించుకోలేక పోతున్నారు. ఇక అలాంటి కుటుంభాలకు కరోనా సోకితే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. ఎన్నో ప్రముఖ కంపెనీలు సైతం మూతబడుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది కొత్త ఉద్యోగాలు కుటుంభాన్ని ఎలా నెట్టుకు రావాలోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఆస్ట్రేలియాలో ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వ్యక్తికి ఎదురయ్యింది.
సెక్యూరిటీ గార్డ్ గా అతడికి పెద్దగా వచ్చేది కూడా ఉండదు అయినా అతడి వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఒక రోజు అతడి కూతురికి కొన్ని వస్తువులు తీసుకోవాలని వెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో లాటరీ వెస్ట్ అనే బోర్డ్ కనపడింది, అంతేకాదు అతిపెద్ద లాటరీ మొత్తం బహుమతిగా ఉండటంతో కొనాలా వద్దా అనే ఊగిసలాటలో దేవుడిపై భారం ఉంచి మొత్తానికి లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.
అయితే లాటరీ వెస్ట్ సంస్థ లక్కీ డ్రా తీయడంతో అతడు కొన్ని లాటరీకి టిక్కెట్టుకు ఏకంగా రూ. 31 కోట్లు మొత్తం బహుమతిగా వచ్చింది. ఈ విషయం నిర్వాహకుల ద్వారా తెలుసుకున్న అతడు ఉబ్బితబ్బిబవుతున్నాడు. కరోనా కారణంగా ఉద్య్గోం పోయిందని అప్పటి నుంచీ ఎన్నో కష్టాలు పడుతున్నానని ఇన్నిదేవుడు నాపై దయచూపాడు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ డబ్బులో కొంత తన అన్నకు ఇల్లు కొంటానని, తానూ కూడా ఇల్లు కట్టుకుంటానని, మంచి పనులకు ఉపయోగిస్తానని తెలిపాడు.