ప్రపంచ క్రికెట్లో సరికొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఐసీసీ ఈ కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా ఇంగ్లండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సీరిస్ నుంచే అమల్లోకి తీసుకురానుంది. ఈ సీరిస్ నుంచే ఫ్రంట్ ఫు్ నోబాల్‌ను టీవీ అంఫైర్ ప్రకటించే విధానం తీసుకువచ్చింది. ఇప్పటికే ఇంగ్లండ్-ఐర్లాండ్ మధ్య జరిగిన సిరీస్ ద్వారా వన్డే సూపర్ లీగ్‌లోనూ ఈ రూల్ అమలులోకి వచ్చింది. టెస్టుల్లోనూ ఇదే విధానాన్ని వినియోగించాలని భావిస్తున్న ఐసీసీ.. ఇంగ్లండ్, పాక్ సిరీస్‌లో ప్రయోగిస్తున్నది. ఈ విషయాన్ని బుధవారం ట్వీట్ చేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిఫ్‌లో భాగంగా ఇండ్లండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సీరిస్ జరగనుంది. ఈ సీరిస్‌లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తుంది. దీనికి ఇరు జట్లు మద్దతు తెలిపాయి. ఈ సీరిస్‌లో వచ్చిన ఫలితం బట్టి దీనిని భవిష్యత్తులో కొనసాగించాలా ? వద్దా ? అని నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చెప్పింది.