కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు కజిన్ అయ్యే వ్యక్తి పేకాట స్థావరం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో భారీ పేకాట స్థావరంపై పోలీసులు చేసిన దాడిలో సుమారు రు. 5 లక్షల నగదుతో పాటు, ఏకంగా 42 వాహనాలు స్వాధీనం చేసుకుని.. 42 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గుమ్మనూరు మంత్రి జయరామ్ స్వగ్రామం కావడంతో పాటు వరుసకు సోదరుడు అయ్యే నారాయణ అనే వ్యక్తి ఈ స్థావరాన్ని నిర్వహిస్తుండడంతో ఈ స్థావరం వెనక మంత్రి జయరామ్ స్పందించారు.
ఈ పేకాట వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి ప్రకటించారు. గుమ్మనూరు తమ స్వగ్రామం అయినా.. మా కుటుంబ సభ్యులు అంతా ఆలూరులో ఉంటారని జయరాం చెప్పారు. ఇక శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా, ఎవరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. ఈ విషయంలో పోలీసులు నిజాయితీతో వ్యవహరిస్తున్నారని మంత్రి చెప్పారు.