Politicsహైద‌రాబాద్‌లో జోరు త‌గ్గిన క‌రోనా... ఇదేమి గుడ్ న్యూస్ కాదు...!

హైద‌రాబాద్‌లో జోరు త‌గ్గిన క‌రోనా… ఇదేమి గుడ్ న్యూస్ కాదు…!

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనా జోరు గ‌త రెండు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ నెల 2వ తేదీన 500కు పైగా కేసులు న‌మోదు కాగా… మూడో తేదీన 391 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక శ‌ని, ఆదివారాల్లో క‌లిపి 1095 కేసులు నమోదుగా కాగా, సోమ, మంగళవారాల్లో 664 మందికి వైరస్‌ సోకింది. రెండు రోజుల్లోనే భారీగా తేడా కనిపిస్తోంది. జూలైలో గ్రేట‌ర్లో జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకు వెళ్లిన క‌రోనా జోరు ఆగ‌స్టులో పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఆగ‌స్టు నెల తొలి మూడు రోజుల్లో ఇక్క‌డ క‌రోనా కేసులు త‌గ్గ‌డం వెన‌క ఎవ్వ‌రూ క‌రోనా ప‌రీక్ష‌ల‌కు ముందుకు రాక‌పోవ‌డ‌మే అని తెలుస్తోంది.

 

ఓ వైపు వ‌రుస‌గా సెలువులు రావ‌డంతో గ్రేట‌ర్లో ఎవ్వ‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. అందువ‌ల్లే ప‌రీక్ష‌ల‌కు వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గిన‌ట్టు చెపుతున్నారు. శనివారం బక్రీద్‌, ఆదివారం సెలవు, సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో పరీక్షలు చేయించుకునే వారు తగ్గారు. పండుగ సమయాల్లో కరోనా పరీక్ష చేయించుకోని క‌రోనా వ‌స్తే ఆ సంతోషం ఆవిరి చేసుకోవ‌డం ఎందుక‌నే ప‌రీక్ష‌లకు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మంటున్నారు. దీనిని బ‌ట్టి ఇక్క‌డ మూడు రోజులుగా క‌రోనా త‌గ్గ‌డం గుడ్ న్యూస్ కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news