ప్రస్తుతం కరోనా కష్టకాలంలో అన్ని రంగాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇక సినిమా రంగం అయితే పూర్తిగా కుదేలైపోయింది. థియేటర్లు ఇప్పట్లో తెరచుకుంటాయో ? లేదో తెలియడం లేదు. అసలు సినిమా షూటింగ్‌లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ? కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ అంతా కుదులైంది. నిర్మాతలు బతికే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవాల్సి ఉన్నా కొందరు మాత్రం తాము మెట్టు దిగమని గట్టి పట్టే పడుతున్నారు.
కొందరు హీరోలు మాత్రం నిర్మాతలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ లిస్టులో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా కోసం తీసుకున్న రు. 9 కోట్ల అడ్వాన్స్‌ను నిర్మాతలకు తిరిగి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు.. ఈ లోగా నిర్మాతలకు వడ్డీలు భారం కాకూడదనే ఇలా చేశాడని అంటున్నారు. ఎన్టీఆర్ నిర్ణయాన్ని ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అందరూ స్వాగతిస్తున్నారు.
ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలు సైతం తమ కొత్త సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్లు తిరిగి ఇవ్వడమో లేదా మిగిలిన రెమ్యునరేషన్లలో కోత విధించుకోవడమో చేస్తున్నారట. ఇక నిర్మాతలు సైతం ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యి ఉండి కూడా మంచి ఒరవడికి శ్రీకారం చుట్టాడని మెచ్చుకుంటున్నారు.