దివంగత బాలీవుడ్ వర్థమాన హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న హీరోయిన్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి విషయంలో రోజుకో కొత్త ఆరోపణ వినిపిస్తోంది. తాజాగా ఆమెకు డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని.. ఈ క్రమంలోనే డ్రగ్ డీలర్లతో ఆమె చాట్ చేసిందని కూడా ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఇక సుశాంత్ తరపున వాదిస్తోన్న తండ్రి తరపున న్యాయవాది రియాపై మరో ఆరోపణ కూడా చేశాడు.
లాయర్ కెకె. సింగ్ మాట్లాడుతూ సుశాంత్‌కు తెలియకుండానే రియా అతడికి నిషేధిత డ్రగ్స్ ఇచ్చేదని.. అతడి మరణానికి ఇది కూడా ఓ కారణమని కెకె సింగ్ తెలిపాడు. ఇక ముందు నుంచి కూడా సుశాంత్‌కు తెలియకుండానే ఏవేవో మందులు ఇస్తున్నారని కూడా కుటుంబ సభ్యులకు అనుమానం ఉండేదట. ఇదే విషయాన్ని వారు ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నారు. ఇక సుశాంత్‌కు తెలియకుండానే డాక్టర్లు రాయని డ్రగ్స్‌ను కూడా బలవంతంగా అలవాటు చేసేవారని.. వీటితో సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించారా లేదా హత్య చేశారా ? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
ఇక సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్లో నిద్రపోతుంటే రియా పై అంతస్తులో పార్టీలు చేసుకునేదని.. ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేసేదని ఇంట్లో ఉన్న పనివాళ్ల ద్వారా తెలిసిందని కెకె సింగ్ చెపుతున్నారు. ఇక రియా డ్రగ్ డీలర్లతో చాట్ చేసేదని.. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఈడీ డిపార్ట్మెంట్ సీబీఐకు అందించింది అనే కథనాలు బయటకు వచ్చాయి. మరోవైపు రియా న్యాయవాది మాట్లాడుతూ రియా ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని కావాలంటే ఆమెకు రక్తపరీక్షలు చేసుకోవచ్చని చెపుతున్నాడు.