సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్ గత నాలుగైదేళ్లుగా ఎంత ఫుల్ స్వింగ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ కెరీర్‌లోకి నమ్రత వచ్చాక మనోడికి వరుస హిట్లు పడుతున్నాయి. శ్రీమంతుడు సినిమా విషయంలో నమ్రత చాలా కేర్ తీసుకుంది. ఆ టైంలో శ్రీమంతుడు మహేష్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రెండు ప్లాపులు వచ్చినా మళ్లీ నమ్రత చక్రం తిప్పడంతో కొరటాల శివ మహేష్‌తో భరత్ అనేనేను సినిమా చేశాడు.
భరత్, మహర్షి, సరిలేరు లాంటి వరుస సూపర్ డూపర్ హిట్లతో మహేష్ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాడు. ఇక నమ్రత మహేష్‌లో చాలా అలవాట్లను సైతం మార్పించిందన్న ప్రచారం ఉంది. ఇక మహేష్‌కు కొన్నేళ్ల వరకు సిగరెట్లు తాగే అలవాటు చాలా ఎక్కువుగా ఉండేదట. రోజుకు ఫ్యాకెట్లు ఉఫ్‌మని ఊదేసేవాడట. ఈ సిగరెట్లు విపరీతంగా తాడడం వల్ల అరోగ్యం దెబ్బతింటుందని పర్సనల్ డాక్టర్లు చెప్పినా వినేవాడు కాదట. అయితే చివరకు ఉన్నట్టుండి మహేష్ ఈ అలవాడు మానేశాడు.
అది కూడా ఓ పుస్తకం వల్ల ప్రేరణకు గురయ్యి కావడం విశేషం. ‘ అలెన్ కార్ ఈజ్ వేటు ‘ అనే పుస్తకం చదవడం వల్లే మహేష్ సిగరెట్లు మానేశాడట. మరి ఈ పుస్తకంలో మహేష్‌ను అంతగా ప్రేరణకు గురి చేసిన అంశం ఏముందో కాని .. మనోడ మాత్రం సిగరెట్లకు దూరమైపోయాడు. మరీ భయంకరంగా సిగరెట్లు తాగేవారు ఈ పుస్తకం చదివితే వారిలో కూడా ఈ మార్పు వస్తుందేమో ? చూడాలి.