Politicsఐఏఎస్ తెలుగు రాష్ట్రాల టాప్ ధాత్రిరెడ్డి ఎవ‌రో తెలుసా...

ఐఏఎస్ తెలుగు రాష్ట్రాల టాప్ ధాత్రిరెడ్డి ఎవ‌రో తెలుసా…

యూపీఎస్‌సీ మంగ‌ళవారం వెల్ల‌డించిన సివిల్ స‌ర్వీసెస్ ఫ‌లితాల్లో తెలుగు విద్యార్థులు స‌త్తాచాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా అభ్య‌ర్థులు వివిధ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యారు. ఇక ఈ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌సింగ్‌ ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఇక జతిన్‌ కిషోర్‌ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించారు. ఈ ఫ‌లితాల్లో తెలంగాణ‌లోని యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి అల్‌ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్‌ అనిపించుకున్నారు.

 

ఆమె గ‌తంలోనే సివిల్స్ రాసి 283వ ర్యాంకు సాధించారు. ప్ర‌స్తుతం ఐపీఎస్ శిక్ష‌ణ‌లో ఉన్న ఆమె మ‌ళ్లీ పట్టుద‌ల‌తో ఐఏఎస్ సాధించాల‌ని ప‌రీక్ష రాసి ఈ సారి 46వ ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపిక‌య్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమే టాప్ ర్యాంక‌ర్‌. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మల్లవరపు సూర్య తేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, సింగారెడ్డి రిషికేశ్‌ రెడ్డి 95వ ర్యాంకు సాధించి టాప్‌ 100లో నిలిచారు. టాప్‌ 100 నుంచి 200లోపు ర్యాంకుల్లో మరో ఐదుగురు తెలుగు అభ్యర్థులు ఉండటం విశేషం. ఇక 200 నుంచి 300 ర్యాంకుల్లోపు మరో పది మంది సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news