హాస్యనటుడు ధన్‌రాజ్ తాను తప్పు చేశాను.. తనను క్షమించాలని ప్రజలను వేడుకున్నాడు. ధన్‌రాజ్ ఇటీవల ఓ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో ఓ స్కిట్ చేశాడు. ఈ స్కిట్లో హిందూ దేవుళ్లపై కొన్ని వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ధన్‌రాజ్‌కు ఫోన్ చేసి మీరు చేసిన స్కిట్లో కొన్ని వ్యాఖ్యలు హిందూ దేవుళ్ల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ధన్‌రాజ్‌కు సూచించారట.
దీనిపై బయట కూడా చర్చలు జరుగుతుండడంతో దీనికి ఇక్కడితో చెక్ పెట్టేయాలని ధన్‌రాజ్ భావించారు. స్కిట్ లో ఏదో హస్యం పండించటం కోసం మాత్రమే తాను అలా మాట్లాడినట్టు తాను రిలీజ్ చేసిన వీడియోలో తెలిపాడు. ఇలాంటి తప్పు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చాడు ధనరాజ్. ధన్‌రాజ్ స్వయంగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్స్టాప్ పడింది.