టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా పెళ్లికి గెస్ట్లుగా ఎవరెవరు వెళుతున్నారు ? ఎవరికి ఆహ్వానాలు అందాయన్నదానిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ లిస్టు వైరల్ అవుతోంది. రానా తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను ఈ నెల 8వ తేదీన పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లిన ముందుగా హైదరాబాద్‌లోని ఫలక్నామా ప్యాలెస్‌లో జరిపించాలని అనుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో రామానాయుడు స్టూడియోలో అతి తక్కువ మంది అతిథుల సమక్షంలోనే రానా పెళ్లి జరగనుంది. 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య ఎన్క్లేవ్, ఖాజాగూడ, మణికొండలో ఈ పెళ్లి జరగనుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించాలని ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. మొత్తం 30 నుంచి 50 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారు. రానా, మిహీకా కుటుంబాలకు చెందిన వారితో పాటు ఇండస్ట్రీ నుంచి నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,దిల్ రాజు, రాజమౌళి, సుబ్బిరామిరెడ్డి, వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం.