కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలోనే మనదేశంతో పాటు యూరప్, ఆసియా, పలు అమెరికా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యేందుకు సమయం దగ్గర్లోనే ఉంది. ఇప్పటికే మన దేశంలో కేసులు 19 లక్షలు దాటేశాయి.. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా కేసులు 1,87,06,109 పాజిటివ్ కేసులు నమోదు కాగా..7,04,396 మంది మరణించారు. బుధవారంతో కరోనా మరణాల సంఖ్య 7లక్షల మార్క్ క్రాస్ అయ్యింది.
ఇక కరోనా మరణాలు అమెరికాతో పాటు భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లోనే ఎక్కువుగా ఉంటున్నాయి. గత రెండు వారాల సగటు డేటా పరిశీలిస్తే కోవిడ్-19 వల్ల ప్రతి 24 గంటలకు సగటున 5,900 మంది చనిపోతున్నారు. అంటే, ప్రతి గంటకు 247 మంది లేదా ప్రతి 15 సెకన్లకు ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా(1,60,290), బ్రెజిల్(96,096), మెక్సికో(48,869), బ్రిటన్(46,299), భారత్(39,820) దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి.