యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానాన్ని మార్చేసింది. ప్రపంచం ఉరుకు పరుగులు లేకుండా ప్రశాంతంగా ఉంది. మనిషి పరుగులకు కరోనా బ్రేక్ వేసింది. ప్రతి ఒక్కరు శానిటైజేషన్ చేసుకోవడంతో పాటు భౌతిక దూరం కూడా పాటిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కరోనా లేకముందు ఎవరికి వారు రోడ్ల మీద కలిసి ఇష్టమొచ్చినట్టు మందు తాగుతూ ఉండేవారు.
ఇప్పుడు కరోనా దెబ్బతో మందుబాబులు బీరు వద్దు విస్కీయే ముద్దు అంటున్నారు. సహజంగానే మందుబాబులు ఒక్కొక్కరు 3 నుంచి 5 వరకు బీర్లు తాగుతుంటారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో బీర్ల అమ్మకాలు పడిపోయి విస్కీ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.
దీనికి ప్రధాన కారణం కరోనాయే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో బీరు తాగితే జలుపు చేస్తుందని.. ఫలితంగా రోగ నిరోధక శక్తి మరింత తగ్గుతుందని జనాలు భావిస్తున్నారు. అందుకే వీరంతా ఇప్పుడు బీరుకు బదులు వీస్కీయే తీసుకుంటున్నారట. గతంలో ఒక్కో వ్యక్తి ఒకటికి మించిన బీరు తాగేవారట. ఇప్పుడు బీరు అమ్మకాలు ఏకంగా 45 శాతం పడిపోయాయని తెలుస్తోంది. బీర్ల అమ్మకాలు తగ్గిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో షాపుల యజమానులు బీర్ల స్టాక్ తగ్గించి వైన్ స్టాక్ పెంచేస్తున్నారు.
గత కొన్నేళ్లలో ఇప్పుడు పడిపోయినంత దారుణంగా బీర్ల అమ్మకాలు ఎప్పుడూ పడిపోలేదట. ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు 45 శాతం పడిపోగా ఇప్పటకీ అదే పరిస్థితి కొనసాగుతోందట. చిల్డ్ బీరు తాగితే జలుబు వస్తుందనే భయంతో బీరు తాగడం మానేశారు అని షాపుల యజమానులు చెపుతున్నారు. ఏదేమైనా కరోనా అటు విళయం ఎలా సృష్టిస్తుందో ఇటు ఇలాంటి కామెడీ అంశాలకు కూడా కారణం అవుతోంది.