ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయా ? అంటే కరోనా ప్రభావంతో జగన్ ఇప్పుడు కొద్ది రోజుల పాటు క్వారంటైన్‌లోకి వెళ్లేట్టుగానే వాతావరణం ఉంది. కరోనా ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఎటాక్ అయ్యింది. గత నెల రోజులుగా 10 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా ఎటాక్ అయ్యింది. వీళ్లంతా వైసీపీ ఎమ్మెల్యేలే.. పార్టీ మారి వచ్చిన కరణం బలరాంతో పాటు ఆయన కుమారుడు వెంకటేష్‌కు సైతం కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక నిన్న ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిన వార్తలతో వైసీపీ షాక్‌లో ఉండగానే గత రాత్రి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతోన్న ఆయనకు కోవిడ్ టెస్టులు చేయగా ముందు నెగిటివ్ రాగా.. ఆ తర్వాత పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే బాలినేని ఇటీవల అనేక పనుల నిమిత్తం సీఎం జగన్‌ను కలిశారట.
జగన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు అయిన మంత్రి. ఇటీవల తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు పలు సార్లు బాలినేని వచ్చినట్టు చెపుతున్నారు. దీంతో జగన్ కూడా కొద్ది రోజుల పాటు అందరికి దూరంగా క్వారంటైన్లోకి వెళ్లవచ్చని కూడా వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కటే టెన్షన్ మొదలైంది. ప్రజల్లోకి వెళుతున్న పలువురు తమ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా వస్తుండడంతో ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.