భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శనివారం ధోనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ధోనీ రిటైర్మెంట్పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.
తన ట్వీట్టర్లో చంద్రబాబు ధోనీ జీవితంలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నందుకు ఆల్ ద బెస్ట్… ఇక నుంచి ధోనీని టీమిండియా జెర్సీలో చూడటాన్ని మిస్సవుతాం. అలాగే ధోనీ ఇచ్చే అత్యుత్తమ క్రికెట్‌ను.. ఆ ఫీలింగ్స్‌ను కూడా కోల్పోతామని పేర్కొన్నారు. ఫైనల్‌గా ధోనీ ఇన్నేళ్ల ఆటతో మన దేశం యావత్ గర్వపడేలా చేశావు.. దీనిని మేం అంతా ఎంతో గౌరవిస్తాం అని.. ఇక వీడ్కోలు అని పేర్కొన్నారు.