కరోనా నేపథ్యంలో వేరే దారులు లేక.. జల్సాలకు అలవాటు పడిన మోడల్స్ చివరకు బ్లూఫిల్మ్‌లలో నటించేందుకు సైతం రెడీ అయిపోతున్నారు. తాజాగా ఫాంహౌస్‌లో ముగ్గురు మోడళ్లతో నీలిచిత్రాలు తీసి ఒటీటీలో పోస్టు చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరానికే చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీపక్ సోనీ, అతడి స్నేహితుడు కేశవ్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠాకు చెందిన వారే మరో ఏడుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇండోర్ నగరంలోని ఓ ఫాం హౌస్ లో ముగ్గురు మోడళ్లతో కలిసి నీలిచిత్రాలు తీసి అశ్లీల సైట్లలో పోస్టు చేశారని సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైతం ఉండడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. మోడలింగ్ ఏజెన్సీ నడిపే బ్రిజేంద్ర గుర్జార్, కెమేరామెన్ అంకిత్ చావ్లాతో పాటు మరో ఐదుగురికి నీలి చిత్రాలతో లింకులు ఉన్నాయని సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
వీళ్లు సినిమా షూటింగ్ అంటూ ఫామ్ హౌస్‌లో మోడళ్లతో నీలిచిత్రాలు తీస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ నివాసి హుసేన్ అలీ సహకారంతో 22 దేశాల్లో ఈ నీలిచిత్రాలను పోస్టు చేస్తున్నారని పోలీసులు కనుగొన్నారు.