సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతో ఫ్యూచర్ వున్న హీరో అర్థాంతరంగా తనువు చాలించడం పట్ల సగటు అభిమాని ఆవేదనకు గురవుతున్నాడు. యావవత్ భారతం ప్రస్తుతం సుశాంత్ కేసు ఏ మలుపు తిరిరుగుతుంది ? ఎవరి రహస్యాలు బట్టబయలవుతాయి ? సుశాంత్ మృతి వెనక ఎలాంటి కుట్ర జరిగింది? ఆ కుట్ర వెనక వుంది రియానా ? లేక ఆమె వెనక వేరే ఎవరైనా వున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా వుంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్శదర్శి మురళీధర్‌రావు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. భారతదేశ ప్రజలు ఈ కేసును ఆసక్తిగా గమనిస్తున్నారని, ఈ కేసు చుట్టూ పలు అనుబంధ కేసులు పుట్టుకొస్తుండటంతో సుశాంత్ సూసైడ్ కేసు పరిధి పెరిగిపోయిందన్నారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం వుందన్నారు.
సుశాంత్ ఆత్మ హత్యకు పాల్పడటం, హఠాన్మరణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇప్పటికే మనీ ల్యాండరింగ్ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు ని వివిద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తుండటంతో కేసు పెద్దదుదవుతూ వస్తోందని మురళీధర్‌రావు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతే కాకుండా ఈ కేసుకు సహకరిస్తున్న వారంతా సుశాంత్‌కు న్యాయం జరగాలని, క్లీన్ బాలీవుడ్ ఉద్యమానికి సహకరిస్తున్నారని వెల్లడించారు. అయితే తలపిండిన మహేష్‌భట్, కరణ్ జోహార్ లాంటి తిమింగళాలున్న బాలీవుడ్ క్లీన్ అవ్వడం ఖాయమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.