బుల్లితెరపై ఎంతో ఆకట్టుకున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఈ నెలాఖరున ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోస్ట్‌లతో నాగార్జున ప్రోమోలు కూడా షూట్ చేస్తున్నారు. షోలో పాల్గొనే 15 మంది ఇప్పటికే క్వారంటైన్‌లో కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే వరుసగా ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతోంది. క్వారంటైన్‌లో ఉన్న ఓ కంటెస్టెంట్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగానే ఈ షో ఆపేయాలంటూ కొందరు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మాటకు వస్తే బిగ్‌బాస్ మూడు సీజన్లకు ముందు ప్రారంభానికి కూడా ఇదే కంప్లెంట్లు వచ్చాయి. బిగ్‌బాస్ 4ను నిలిపి వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ ముక్తల, తల్లిదండ్రుల సంఘం నేత గడ్డం మురళీతో పాటు తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత అమన్ మురళీ తదితరులు ఫిర్యాదు చేశారు. మరి వీరి ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఇక గత మూడు సీజన్ల ప్రారంభానికి ముందు ఇవే ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఈ చిక్కుముడులు తొలగిపోయి బిగ్‌బాస్ 4 ప్రారంభమవుతుందని కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో వెయిటింగ్‌లో ఉన్నారు.