తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మా టీవీల్లో నాగార్జున ప్రోమోలో లేదా బిగ్‌బాస్ 4 త్వరలోనే అన్న ప్రోమోలో మినహాయించి అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నదానిపై క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో వికీపీడీయా ఈ సస్పెన్స్ కు తెర దించింది. వికీపీడియాలో బిగ్‌బాస్ 4 పేరిట ఓ పేజ్ క్రియేట్ చేశారు. ఈ పేజ్ షో నిర్వాహకులు క్రియేట్ చేసి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇందులో బిగ్‌బాస్ ఎన్ని రోజులు ఉంటుంది ? ఎంత మంది హౌస్ మెట్స్ పాల్గొంటారో ? క్లారిటీ ఇచ్చారు.
మొత్తం 15 మంది హౌస్ మెట్స్ పాల్గొంటారని.. మొత్తం 105 రోజుల పాటు జరిగే ఈ ఎపిసోడ్‌లో 106 షోలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్ గురించి కొంత డేటా కూడా ఇక్కడ ఉంచారు. ఇక షో ఆగస్టులో ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన తొలి ఎపిసోడ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే షోలో పాల్గొనే 15 మంది కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు పంపేశారు.