ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి హైకోర్టుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతోన్న సంగతి తెలిసిందే. ఈ వరుస షాకుల పరంపరలో మరోసారి కోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ ఏపీకి మూడు రాజధానులు అవసరం అని చెప్పి రాజధాని వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించడంతో పాటు దీనికి గవర్నర్ ఆమెదముద్ర వేయడంతో మూడు రాజధానులు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ప్రభుత్వానికి కూడా కోర్టు కొన్ని సూచనలు చేసింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. మళ్లీ ఈ కేసు విచారణ ఆగష్టు 14కు వాయిదా వేస్తూ అప్పటి వరకు యధాతధ స్థితి ఉంటుందని చెప్పింది. ఏదేమైనా కోర్టులో సరైన వాదనలు లేకపోతే.. ఈ అంశంపై త్వరగా ముగింపు లేకపోతే జగన్ యూ టర్న్ తీసుకోక తప్పేలా లేదు.