ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. కరోనా సోకిన వారి ఈ విషయం బయటకు చెప్పకపోవడంతో వీరి ద్వారానే మరికొంత మందికి కరోనా సోకుతోంది ఇది పెద్ద డేంజర్‌గా మారుతోంది. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 10128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఏకంగా 77మంది కరోనాతో చనిపోవడం విషాదం నింపింది. తాజా 10వేలకు పైగా కేసులో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 186461కు చేరాయి. తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురంలో కరోనా పంజా విసురుతోంది.
ఇక ఏపీలో కరోనా ఈ స్థాయిలో జోరందుకోవడానికి ప్రధాన కారణం కరోనా సోకిన వారిని సమాజంలో చుట్టు పక్కల వారు అదోలా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల వీరిని గ్రామాల్లోకి కూడా రానివ్వడం లేదు. దీంతో వారు కరోనా వచ్చి కూడా కరోనా ఉన్నట్టు చెప్పేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ద్వారా మరికొంత మందికి కరోనా వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి విషమించే వరకు కూడా వారు హాస్పటల్స్‌కు రావడం లేదు. కరోనా సోకితే బయట వ్యక్తులు పలు రకాలుగా అనుమానిస్తుండడంతో కరోనా రోగుల మిస్సింగ్స్ ఏపీలో వేలల్లో ఉంటున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు యూపీలోనూ కరోనా రోగులను గుర్తించలేకపోతున్నారన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఏపీలోనూ కరోనా జోరుకు కరోనా రోగులు బయటకు చెప్పకపోవడంతో పాటు వీరి ద్వారా మరికొంతమందికి ఈ వైరస్ సోకడమే కారణంగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో కరోనా పరీక్షల కోసం వచ్చిన వారు తప్పుడు చిరునామాలు ఇస్తున్నారు. ఫలితంగా వారికి కరోనా ఉన్నా కూడా వారి అడ్రస్ ట్రేస్ చేయడం కష్టమనిపిస్తోంది.