తెలుగుమ్మాయి అయినా తెలుగుతో పాటు అటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటింది అంజలి. తెలుగులో యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అంజలియే బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. కోలీవుడ్‌లోనూ సూపర్ హిట్లతో సత్తా చాటుతున్న అంజలి అక్కడ హీరో జైతో కొద్ది రోజుల పాటు ప్రేమాయణం నడిపింది. వీరిద్దరు సహజీవనం కూడా చేశారు. వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళుతోందని అనుకుంటోన్న టైంలో ఏమైందో కాని విడిపోయారు. ఇక ఇప్పుడు జైకు దూరమయ్యాక అంజలి మరో కొత్త ప్రేమలో మునిగి తేలుతుందట.
సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్స్ ఉంటారు. అంజలి జీవితంలో తన పెంపుడు కుక్కకు అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అంజలి తాజాగా కొన్ని ఇంట్రస్టింగ్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు పెట్స్‌పై ఉన్న ప్రేమను చాటుకుంది. పోలో అనే పెట్‌ను అంజలి పెంచుకుంటోన్న సంగతి తెలిసిందే. నా జీవితంలోకి నువ్ వచ్చి ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నందుకు థ్యాంక్స్ అంటూ తెగ మురిసిపోయింది. ఇ అంజలి ప్రస్తుతం నిశ్శబ్దం, వకీల్‌సాబ్ సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది.