టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి లాంటి వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ యంగ్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌ను సెట్ చేయడమే గొప్ప విషయం.. అలాంటిది రాజమౌళి వీరిద్దరిని కలిపి చారిత్రక హీరోలు అయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలతో సినిమా తీయడమే గొప్ప విషయం. ఇక ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి హీరోయిన్ ఆలియాభట్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఉండడం లేదు.
ముందు చరణ్ పక్కన ఆలియా భట్ పేరు ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు రాను రాను ఆమెకు బాలీవుడ్‌లో కమిట్‌మెంట్స్ ఎక్కువ అవ్వడం.. మరోవైపు కరోనా వల్ల ఆమె ఇచ్చిన కాల్షీట్లు అన్నీ క్యాన్సిల్ అవ్వడం, ఇప్పుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులే కాకుండా సామాన్య జనాల్లోనూ ఆమెతో పాటు ఆమె తండ్రి మహేష్‌భట్‌పై నెగిటివిటీ పెరిగిపోవడంతో ఆమెను సినిమాలో కొనసాగించే ఉద్దేశంలో చివరకు యూనిట్ సైతం డైలమాలో పడింది. రాజమౌళి కూడా ఈ విషయంలో కాస్త ఆందోళనలోనే ఉన్నాడంటున్నారు.
సుశాంత్ మరణం తర్వాత ఆమె పేరుపై బాగా దుమారం రేగింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఏ సినిమా చేసినా దానిపై వ్యతిరేక ప్రచారమే ఎక్కువుడి నడిచే స్కోప్ కనపడుతోంది. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ ఆర్ ఆర్ ఆర్‌పై కూడా పడింది. రాజమౌళి సైతం ఆమె కండీషన్లకు ఓకే చెప్పలేక ఇప్పటి దాకా సతమతమవుతూ వచ్చాడట. ఇప్పుడు ఆమెను తప్పించే ఆలోచనకే మనోడు మొగ్గు చూపుతున్నాడంటున్నారు. మరోవైపు ఆమెకు బదులుగా ప్రియాకం చోప్రా పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది.