కరోనా గురించి రోజుకో షాకింగ్ నిజం బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే కొందరికి తమకు తెలియకుండానే కరోనా వస్తోందని పరిక్షల్లో తేలుతోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కొందరు కరోనా ప్రభావానికి గురవుతున్నారు. ఇక ఖతార్ విషయానికి వస్తే అరేబియా గల్ఫ్ ప్రాంతంలో 28 లక్షల జనాభా కలిగిన ద్వీపకల్పం. ఇక యాంటీ బాడీ పరీక్షలు, ఇతర సీరో పరీక్షల ద్వారా ఈ దేశ జనాభాలో ఇప్పటికే సగం మందికి పైగా కరోనా వైరస్ ప్రభావానికి గురైనట్టు తేలింది. ఈ దేశంలో మే నెలలోనే కరోనా తీవ్ర ప్రభావం చూపించింది.
అసలు ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా ఎందుకు వస్తుందో ? అర్థం కాక అక్కడ ప్రజారోగ్యశాఖతో పాటు శాస్త్రవేత్తలు కొన్ని వేల మందిపై పరిశోధనలు చేస్తున్నారు. పైగా ఇక్కడ కరోనా వస్తోన్న వారిలో వైరస్ లోడ్ కూడా చాలా ఎక్కువగానే ఉందట. ఇక కరోనా పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చిన వారిలో మళ్లీ పరీక్షలు చేశారు. కొందరికి కరోనా వచ్చి తగ్గిన 45 రోజుల్లోగా పరీక్షచేస్తే వారిలో మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఇలా 15 వేల మందికి పైగా రావడంతో వారంతా షాక్ అవుతున్నారు.
ఇదే పెద్ద షాక్ అనుకుంటే చనిపోయిన వారిలో కూడా వైరస్ ఉందని నిర్దారించారు. ఇక శరీరంలో డెడ్ వైరస్ ఉండి ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిలో సైకిల్ థ్రిషోల్డ్ వ్యాల్యూ (సీటీ వ్యాల్యూ) 30 కంటే ఎక్కువగా ఉంది. ఇది డెడ్ వైరస్‌తో సమానం. ఇలాంటి వారికి కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ వస్తోంది.