దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యుల నుంచి సినిమా వాళ్ల వరకు.. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవ్వరిని కరోనా వదలడం లేదు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా ఎమ్మెల్యేలు కరోనా భారీన పడుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్నే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇద్దరూ కరోనాకు భారీన పడ్డారు. ఇదిలా ఉంటే ఒకే రాష్ట్రంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు కరోనా భారీన పడడంతో ఆ రాష్ట్రంలో తీవ్ర అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి.
పంజాబ్‌లో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఉంటే వీరిలో 23 మంది ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో నెగిటివ్ వచ్చిన వారినే అసెంబ్లీ సమావేశాల్లోకి అనుమతి ఇస్తామని చెప్పారు. ఇంత మంది ఎమ్మెల్యేలకే కరోనా రావడంతో రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ? అని అమరీందర్ సింగ్ వాపోతున్నారు.