లాక్ డౌన్ లో అలాంటి పనులు అస్సలు చేయకండి..!

బాలీవుడ్ భామ కియరా అద్వానీ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మహేష్ తో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలు చేసింది. రెండు సినిమాలతోనే ఇక్కడ కూడా పాపులర్ అయిన ఈ అమ్మడు బాలీవుడ్ లో ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం తన హవా కొనసాగిస్తున్న ఈ అమ్మడు లాక్ డౌన్ టైంలో అలంటి పనులు మాత్రం చేయకండని అంటుంది.

ఇంతకీ అమ్మడు చెబుతున్న లాక్ డౌన్ విశేషాలు ఏంటి అంటే.. లాక్ డౌన్ లో అతిగా తినేస్తే తర్వాత కష్టపడాల్సి వస్తుందని అంటుంది కియరా అద్వానీ. తను చేసే ఐటమ్స్ తినకుండా ఉండలేకపోతున్నా అని అయితే నోటికి అదుపులేకుండా తింటే మాత్రం షూటింగ్ టైం లో కష్టపడాల్సి ఉంటుందని చెబుతుంది కియరా అద్వానీ. ఇష్టం వచ్చినట్టుగా తినేసి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది కియరా.

తనలానే అందరు చేయమని చెబుతుందో లేక తాను ఇలా చేస్తున్నా అని చెబుతుందో ఏమో కానీ కియరా టిప్స్ మిగతా హీరోయిన్స్ గా కూడా పాటించేలా ఉన్నారు. తెలుగులో ఆఫర్లు వస్తున్నా చేయలేకపోతున్నా అని ఫీల్ అవుతున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం వరుస ఛాన్సులు పట్టేస్తుంది.

Leave a comment