ఎన్టీఆర్ కోసం పాత చింతకాయ పచ్చడే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓకే చేశాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి పలు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తు్న్నాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎంచుకున్న కథ పాతదేనని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా కథను స్పూర్తిగా తీసుకుని తారక్ కోసం మరోసారి వినియోగించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను ఆడియెన్స్ మెచ్చే విధంగా తీర్చిదిద్దాలని త్రివిక్రమ్ చూస్తున్నాడట.

ఇలా తారక్ కోసం మరోసారి పాత చింతకాయ పచ్చడినే పట్టుకొస్తు్న్న త్రివిక్రమ్, ఆడియెన్స్‌ను ఎంత వరకు మెప్పిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a comment