నారప్పతో తరుణ్.. వాటే కాంబినేషన్!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ‘అసురన్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో నారప్పపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో నారప్ప ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు వెంకీ ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు. పెళ్లిచూపులు వంటి బిగ్గెస్ట్ హిట్‌ను తెరకెక్కించిన విలక్షణ నటుడు తరుణ్ భాస్కర్, గతంలో వెంకటేష్ కోసం ఓ కథను రెడీ చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు నారప్ప షూటింగ్ సమయంలో తరుణ్ మరోసారి ఆ కథను వెంకీకి వినిపించాడట. కథ ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఫిక్స్ అయిన వెంకీ, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఈ సినిమాను కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించేందుకు రెడీ అయ్యాడు. అన్నీ అనుకున్నట్లు కుదురితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడం ఖాయమని అంటున్నారు చిత్ర వర్గాలు. మరి వెంకీతో తరుణ్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Leave a comment