సీడెడ్‌కు చెమటలు పట్టించిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కేవలం సీడెడ్ ప్రాంతం బయ్యర్లు ఏకంగా రూ.35 కోట్లు చెల్లించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ రేటుకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు కావడంతో, సీడెడ్ ప్రాంతంలో ఇదే హయ్యెస్ట్ రేటు అని తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను కీరవాణి సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Leave a comment