ఆ ఒక్కడి వల్ల మూడ్ మొత్తం పోతుంది.. అందుకే దూరం పెట్టా..!

స్టార్ హీరోయిన్స్ ఈమధ్య కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ బ్లాగ్స్ లో కూడా రెచ్చిపోతున్నారు. సినిమాల్లో పాత్రల వరకే పరిమితం అవ్వాలి కాని కాని ఫోటో షూట్స్ లో అలా కాదు.. అందుకే హీరోయిన్స్ అంతా వారానికో ఫోటో షూట్ తో హుంగామా చేస్తుంటారు. తమ ఫోటో షూట్స్ అన్ని ట్విట్టర్, ఇన్ స్టాలో పెట్టేస్తారు. అయితే అందరు హీరోయిన్స్ ఒక దారి తనదొక దారి అన్నట్టుగా ఉంది రెజినా.. తను మాత్రం ఈ ఫోటో షూట్స్ కు దూరమని చెబుతుంది.

ఒకవేళ చేసినా అవి సోషల్ బ్లాగ్ లో పెట్టానని అంటుంది అమ్మడు. అలా ఎందుకు అంటే తను పెట్టిన ఒక ఫోటోకి 10000ల మంది లైక్స్ కొట్టినా ఒకరు తప్పుగా మాట్లాడితే మాత్రం తను బాధపడతానని అంటుంది అమ్మడు. ఆ ఒక్కడి వల్లే మూడ్ మొత్తం పోతుందని అన్నది రెజినా. లాస్ట్ ఇయర్ ఎవరు సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇక మీదట కూడా ఫోటో షూట్స్ కు దూరంగా ఉంటుందని తెలుస్తుంది.

Leave a comment