అవకాశాల కోసం అన్ని ట్రై చేస్తున్న బ్యూటీ

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు ఉన్నప్పుడే వాటిని సరిగా వినియోగించుకుంటే స్టార్ స్టేటస్ సాధించడం కష్టమేమి కాదని పలువురు స్టార్ బ్యూటీలు అంటున్నారు. అయితే అవకాశాలు ఉన్నాయని ఏదిబడితే అది చేస్తే చివరకు ఫేడవుట్ అవుతారు. ఇప్పుడు ఇలాంటిదే ఓ హీరోయిన్ విషయంలో జరుగుతోంది. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అను ఇమ్మాన్యుయెల్, అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వరుసగా సినిమా అవకాశాలు చేతిలో ఉండటంతో వచ్చిన ప్రతి సినిమాను చేసుకుంటూ పోయింది. అయితే ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఆమెకు ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. దీంతో ఆమెను పెట్టి సినిమా చేయాలంటేనే నిర్మాతలు జడుసుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా లేకపోవడంతో కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఫోటోషూట్‌లతో యాక్టివ్‌గా ఉంది.

అయితే ఈమె ప్రస్తుతం ఒక్క ఆఫర్ అయినా వస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్ చేయడానికి రెడీ అయ్యింది. తన ఎక్స్‌పోజింగ్‌తోనైనా అమ్మడికి ఆఫర్లు వస్తాయయో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మొత్తానికి అవకాశాలను సరైన పద్ధతిలో ఎంచుకోకపోవడంతో అను ఇమ్మాన్యుయెల్ టాలీవుడ్‌ నుండి ఫేడవుట్ అయ్యేందుకు రెడీ అయ్యింది.

Leave a comment