రెండో పెళ్లితో షాక్ ఇచ్చిన రామ్ హీరోయిన్..!

మళయాళ భామ అమలా పాల్ అందరికి షాక్ ఇచ్చింది. అలాంటి లాంటి షాక్ కాదు అసలే కరోనా కలకలంతో అతలాకుతలం అవుతున్న ఆడియెన్స్ కు రెండో పెళ్లి ఫోటోలతో షాక్ ఇచ్చింది. డైరెక్టర్ విజయ్ తో ప్రేమ పెళ్లితో సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన అమలా పాల్ రెండేళ్లలోనే విడాకులు తీసుకుంది. డైవర్స్ తర్వాత సినిమాల మీద ఫోకస్ పెట్టిన అమలా పాల్ గుజరాత్ కుర్రాడి తో ప్రేమలో పడ్డది. కొన్నాళ్లుగా వార్తల్లో అమలా లవ్ ఎఫైర్ వార్తలు వస్తున్నా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈరోజు సడెన్ గా అమలా అతన్ని పెళ్లి చేసుకుని ఫోటోలు రిలీజ్ చేసింది.

ఈ ఫోటోల్లో తన భర్త భవిందర్ సింగ్ తో చాలా క్లోజ్ గా కనిపిస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లవడం బాగుంది కాని పెళ్లి తర్వాత ఆ లిప్ లాక్ అందరిని ఇబ్బంది పెట్టింది. ఇద్దరికి పెళ్లయింది ఇక ఈ బహిరంగ రొమాన్స్ మాకు అవసరమా చెప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. అమలా పాల్ పెళ్లి మళ్లోసారి కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అనవసరంగా ధనుష్ ను అన్నారు కాని ఈ అమ్మడు అలా విజయ్ తో విడాకులు తీసుకుని కొద్ది గ్యాప్ లోనే మరొకరిని పెళ్లాడింది. తోడు లేకపోతే జీవితం బోర్ కొడుతోంది కాబోలు అమ్మడు ఎప్పుడు ఇలా ఎవరినో ఒకరిని జత కట్టాల్సిందే. మరి విజయ్ పెళ్లి ఎలాగు తొందర పడ్డదనుకున్నా ఈ రెండో పెళ్లి అయినా నిలబెడుతుందో లేదో చూడాలి.

Leave a comment