ఫ్యాన్స్ దెబ్బకు ఆలోచనలో పడ్డ జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ భారతదేశ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా తప్పకుండా ఫాలో అవుతున్న వారి సంఖ్య పెద్దగా ఉంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మార్చి నెలలో రిలీజ్ అవుతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ పాత్రలు ఎలా ఉంటాయా అనే ఆతృత అందరిలో నెలకొంది.

ఇక రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్‌తో పాటు పలువురు ఫారిన్ నటీనటులు కూడా నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను జనవరి 8, 2021లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Leave a comment