ఆ డైరెక్టర్‌తో జెర్సీ వేసుకుంటానంటున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులకు ఆర్ఆర్ఆర్ టీమ్ ఎసరు పెట్టడం ఖాయమని సినీ ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఈ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది.

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత జెర్సీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆ డైరెక్టర్‌కు గతంలోనే అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను రామ్ చరణ్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట చిత్ర యూనిట్. అయితే గౌతమ్ ప్రస్తుతం అల్లు అరవింద్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఆ సినిమా పూర్తయ్యాకే రామ్ చరణ్‌తో సినిమా పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాలో ఎమోషన్స్‌కు కొదువే ఉండదని చిత్ర యూనిట్ అంటోంది. ఏదేమైనా చరణ్‌తో జెర్సీ సినిమా డైరెక్టర్ సినిమా అనగానే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Leave a comment