తుక్కు రేగ్గొడుతున్న చిరు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో చిరు మరోసారి బాక్సాఫీస్‌పై దాడి చేయడం ఖాయమని అంటున్నారు సినీ ప్రేక్షకులు. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో కొరటాల మార్క్ యాక్షన్ సీక్వెన్సులు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్‌ చేస్తున్నాడనే వార్తి ఇండస్ట్రీలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ త్రిషను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిరు తన లుక్, గెటప్‌లను పూర్తిగా మార్చేశాడు. మరి ఈ సినిమాతో చిరు అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలని ఆయన కోరుతున్నారు.

Leave a comment