Moviesనితిన్ భీష్మ రివ్యూ అండ్ రేటింగ్

నితిన్ భీష్మ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: భీష్మ
నటీనటులు: నితిన్, రష్మకి మందన, జిష్షు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకుడు: వెంకీ కుడుముల

యంగ్ హీరో నితిని నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ మొదట్నుండీ మంచి అంచనాలను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటం, గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ ఓనర్ అయిన భీష్మ(అనంత్ నాగ్) తన తరువాత కంపెనీని చూసుకునే సత్తా ఉన్నవారి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో భీష్మ(నితిన్) అతడి కంట్లో పడతాడు. అతడి సత్తా ఏమిటో తెలుసుకునేందుకు అతడిని 30 రోజులపాటు కంపెనీ సీఈఓగా నియమిస్తాడు. అదే కంపెనీలో పని చేసే చైత్ర(రష్మిక)తో నితిన్ లవ్‌లో పడతాడు. ఈ క్రమంలో నితిన్‌కు 30 రోజుల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? వాటిని అతడు ఎలా అధిగమిస్తాడు? చైత్ర నితిన్ ప్రేమను ఒప్పుకుంటుందా? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
భీష్మ ఒ సింపుల్ సబ్జెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం. దర్శకుడు వెంకీ కుడుముల రాసుకున్న కథ మామూలే అయినా అతడు తెరకెక్కించిన విధానం బాగుంది. కథలోని ఫస్టాఫ్‌లో భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ రైతులకు అండగా నిలిచి వారికి సహాయం చేస్తున్న సంస్థగా దాని ఓనర్ అనంత్ నాగ్ నిర్వహిస్తుంటాడు. అయితే ఇతర కార్పొరేట్ సంస్థలు తన కంపెనీని సొంతం చేసుకోవాలని చూడటంతో అతడు తన కంపెనీకి ఓ సరికొత్త సీఈఓని తీసుకురావాలని చూస్తాడు. ఈ క్రమంలో భీష్మగా ఎంట్రీ ఇచ్చిన నితిన్‌కు అనంత్ నాగ్ పెట్టే కండీషన్ సినిమా కథను ముందుకు తీసుకెళుతుంది.

ఈ క్రమంలోనే అక్కడ పనిచేసే చైత్రను నితిన్ ప్రేమించడం, ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అతడు పడే పాట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఓ అదిరిపోయే బ్యాంగ్‌తో వచ్చే ఇంటర్వెల్ సినిమాపై ఆసక్తిని అలాగే మెయింటెయిన్ చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ సీరియస్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. కంపెనీని ఎలాగైనా కాపాడలనే కసితో నితిన్ తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లు రొటీన్‌గానే ఉన్నా మంచి మెసేజ్ కూడా ఉండటంతో సినిమాకు సరైన న్యాయం జరిగిందని ప్రేక్షకులు సంతోషపడతారు.

ఓవరాల్‌గా చూస్తే ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన భీష్మ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండటం, నితిన్, రష్మికల ట్రాక్ చాలా బాగుండటం, కామెడీకి పెద్దపీట వేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

నటీనటులు పర్ఫార్మెన్స్:
భీష్మ పాత్రలో నితిన్ యాక్టింగ్ సూపర్‌ అని చెప్పాలి. చాలా రోజుల గ్యాప్ తరువాత వచ్చిన నితిన్, ఈ సినిమాతో ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పించాడు. కామెడీ ట్రాక్‌లతో నితిన్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక రష్మిక అందాలు ఈ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. నితిన్-రష్మికల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు వెంకీ కుడుముల రొటీన్ కథతో వచ్చినా తనదైన మార్క్ టేకింగ్‌తో సినిమాను ఆసక్తికరంగా మలిచాడు. ఫక్తు కమర్షియల్ అంశాలను ఎలా వినియోగించాలో అలానే వాడుకుని సినిమాను ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు మినహాయిస్తే వెంకీ డైరెక్షన్ ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను చాలా అందంగా చూపించాడు. మహతి స్వర సాగర్ సంగీతం పర్వాలేదనిపించింది. బీజీఎం కూడా ఓకే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా:
భీష్మ – ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌తో నితిన్ కొట్టేశాడు!

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news