ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్, తాజాగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

బాక్సర్ పాత్రలో నటించేందుకు వరుణ్ తేజ్ జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో రఫ్ లుక్‌లో వరుణ్ తేజ్ మనకు కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ బ్యూటీతో వరుణ్ తేజ్ మరోసారి ఫిదా సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నట్లు సినీ జనం అంటున్నారు. ఫిదా చిత్రంలో వరుణ్-సాయి పల్లవి జంట చూడటానికి బాగున్నా వారి ఎత్తుపై పలు కామెంట్‌లు వినిపించాయి. వరుణ్ కంటే ఎత్తులో సాయి పల్లవి చాలా తక్కువగా ఉండటంతో వారి జంట ప్రేక్షకులను అలరించింది.

కాగా తాజాగా తెరకెక్కనున్న వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయిన నిధి అగర్వాల్ చూడటానికి సాయి పల్లవి కంటే కూడా ఎత్తులో చిన్నది. మరి వరుణ్ తేజ్‌తో ఈమె జోడి ఎలా ఉండబోతుందా అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ ఫిదాలోని ఎత్తు సెంటిమెంట్‌ ఈ సినిమాకు కూడా కలిసొస్తే, వరుణ్ తేజ్‌కు మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అంటున్నారు మెగా ఫ్యాన్స్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది.

Leave a comment