సరిలేరు నీకెవ్వరు 6 రోజుల కలెక్షన్స్.. టాప్‌లేపిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మహేష్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రష్మిక మందన్న అందాలతో పాటు కామెడీతో అలరించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు సాధించింది. 6 రోజులు ముగిసే సరికి సరిలేరు నీకెవ్వరు చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.77.94 కోట్లు కొల్లగొట్టింది. శుక్రవారం ముగిసే సరికి ఈ సినిమా 85 కోట్ల మార్కును టచ్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 6 రోజుల కలెక్షన్లు
నైజం – 25.65 కోట్లు
సీడెడ్ – 11.35 కోట్లు
నెల్లూరు – 2.86 కోట్లు
కృష్ణా – 6.27 కోట్లు
గుంటూరు – 7.72 కోట్లు
వైజాగ్ – 11.80 కోట్లు
ఈస్ట్ – 7.23 కోట్లు
వెస్ట్ – 5.06 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 77.94 కోట్లు

Leave a comment