ముద్దు పెట్టబోయిన ఫ్యాన్.. నోరెళ్లబెట్టిన హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. బాలీవుడ్ బ్యూటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వారి అందాలను తెరపై చూసి చొంగకార్చే వారే కాకుండా వారిని బయట కలిసేందుకు పోటీ పడుతుంటారు జనం. ఇక హీరోయిన్లు ఏదైనా ఈవెంట్‌కు హాజరైతే ఆమె అభిమానులు అక్కడికి చేరుకోవడం షరా మామూలే.

కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌ జిమ్‌లో వర్కవుట్ చేసి తిరిగి వెళుతుండగా ఆమెను కలిసేందుకు ఆమె అభిమానులు ఎగబడ్డారు. ఒక్కొక్కరిగా వెళ్లి ఆమెతో సెల్ఫీ ఫోటోలు దిగసాగారు. ఇంతలో ఓ అభిమాని ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయి ఏకంగా ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

హీరోయిన్‌తో సెల్ఫీ దిగేందుకని చెప్పి మనోడు ఏకంగా ముద్దు పెట్టే ప్రయత్నం చేయడంతో ఆమె సెక్యురిటీ అతగాడిని దూరంగా నెట్టేశారు. సెల్ఫీలు చాలంటూ ఇక ఆమె కారులో కూర్చుని తుర్రుమంది. ఏదేమైనా హీరోయిన్లను అభిమానులు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే ఘటనలు మనం చూస్తూనే ఉంటాం.

Leave a comment